గాయని మధుప్రియ దాంపత్యం కథ కంచికి: చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

హైదరాబాద్‌: గాయని మధుఫ్రియ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి. 'ఆడపిల్లనమ్మా..' అనే పాట ద్వారా 13 ఏళ్ల వయసులోనే ఆమె ప్రత్యేక గుర్తింపు, విశేష జనాదరణ పొందిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులను ఎదిరించి, వారితో గొడవ పడి మధుప్రియ గత అక్టోబర్‌లో శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుంది.

Also Read:మధుప్రియ జీవితంలో ట్రాజెడీ మొదలు, నన్ను అడగలేదు: తండ్రి

భర్త తనను వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని మధుప్రియ శనివారం పోలీసులను ఆశ్రయించారు. అమ్మమ్మతో కలిసి హుమాయున్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. నిరుడు అక్టోబరు 30న శ్రీకాంతను మధుప్రియ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భర్తతో కలిసి మె హదీప్నటం పోచమ్మ బస్తీలో నివాసం ఉంటోంది.

Madhu Priya complains on her husband Srikanth

మూడు నెలలు బాగానే ఉన్నాడు...

పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీ కాంత శారీకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. 'నన్ను, మా అ మ్మానాన్నలనూ బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించాడు' అని తెలిపారు. మూడు నెలలు తమ కాపురం బాగానే సాగిందన్నారు.

Also Read: ఫేస్‌బుక్ ప్రేమ కాదు, కొందరిలా లేచిపోలేదు, తప్పు చేశా కానీ: మధుప్రియ

ఆ తర్వాత నుంచి తనను వేధించడం ప్రారంభించాడని చెప్పారు. శ్రీకాంత్ పనిపాట లేకుండా ఇంట్లోనే కూర్చునేవాడని, తాను సంపాదించిన డబ్బుతో మద్యం తాగి తనను వేధించేవాడని తెలిపారు. పుట్టింటికి వెళ్లి లక్షల రూపాయలు తీసుకురావాలని, విలాసవంతమైన జీవితం గడుపుదామని సతాయించేవాడని ఆమె చెప్పారు.

Madhu Priya complains on her husband Srikanth

తరచూ చేయి చేసుకొనేవాడని, వారం క్రితం తనను తీవ్రంగా కొట్టాడంటూ చేతికి ఉన్న గాయాలను చూపించారు. తల్లిదండ్రులను ఎదిరించి మూర్ఖుడిని పెళ్లి చేసుకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకూ రావద్దని కన్నీటిపర్యంతమయ్యారు.

స్పృహ తప్పి పడిపోయిన మధుప్రియ

ఆడపిల్లల జీవితాలపై ఎన్నో పాటలు రాసి, పాడిన తనకు ఇలాంటి భర్త దొరుకుతాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతలాంటి వాళ్లను సమాజంలో బతకనివ్వకూడదని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురైన మధుప్రియ స్పృహ తప్పి పడిపోయారు పోలీసులు ఆమెకు ప్రథమచికిత్స అందించారు.

మధుప్రియ ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై 498(ఎ), 506, 323 సెక్షనల కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హుమాయున్ నగర్‌ సీఐ రవీందర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన పెద్దింటి మల్లేష్‌, సుజాతల రెండో సంతానమైన మధుప్రియ తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తన పాటలతో మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత మధుప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆ సమయంలో ఆదిలాబాద్‌ కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీకాంతతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో గత అక్టోబరులో పెద్దలను ఎదిరించి మధుప్రియ శ్రీకాంత్‌ను వివాహం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+