మంత్రి పదవి రాదనే కవిత రివర్స్ గేర్, ఇది దద్దమ్మ ప్రభుత్వం: మధుయాష్కీ ఫైర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవి రాదనే ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత రివర్స్ గేర్‌లో మాట్లాడుతున్నారని మాజీ ఎంపి, ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఇటీవల జరిగిన సభలో కవిత ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బాగా పని చేస్తున్నారని మెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని విమర్శించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని యాష్కీ మండిపడ్డారు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగినప్పుడు, కేంద్ర మంత్రులతో ముచ్చట్లు పెట్టినప్పుడు, కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో పోలీసు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వివక్ష గుర్తు రాలేదా? అని ఆయన నిలదీశారు.

తెలంగాణ ప్రభుత్వం చేతకాని, చేవలేని దద్దమ్మలా మారిందని, కేంద్రం వివక్ష చూపిస్తున్నదని టిఆర్‌ఎస్ ఎంపీలు విమర్శించడం వారి చేతకానితనానికి నిదర్శనమని మధుయాష్కీ విమర్శించారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications