షాక్: ఎన్నారై టెక్కీ మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి శుక్రవారం ఆత్మయత్యాయత్నం చేశారు. దీంతో ఆమెను హుటాహుటిన కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్: ఎన్నారై మధుకర్ రెడ్డి భార్య స్వాతి శుక్రవారం ఆత్మయత్యాయత్నం చేశారు. దీంతో ఆమెను హుటాహుటిన కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్వాతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇటీవలే మధుకర్ రెడ్డి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఆందోళన కారణంగానే మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని స్వాతి రెండ్రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపింది. అంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Madhukar Reddy wife swathi attempted to commit suicide

కాగా, అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు భువనగిరిలో జరిగాయి. అంత్యక్రియాల్లో పాల్గొనేందుకు వెళ్లిన స్వాతిపై మధుకర్ రెడ్డి కుటుంబసభ్యులు దాడి చేశారు. మధుకర్ రెడ్డి మరణానికి స్వాతే కారణమంటూ ఆరోపించారు.

swathi

దీంతో ఆ మరుసటి రోజే మీడియా సమావేశంలో మధుకర్ రెడ్డి మరణంతో తనకు సంబంధం లేదని స్వాతి తెలిపింది. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పింది. మధుకర్ కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన కూతురుకు రక్షణ కల్పించాలని స్వాతి పోలీసులను కోరారు.

బెదిరింపులకు గురిచేస్తున్నారు: స్వాతి తండ్రి

ప్రస్తుతం స్వాతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆమె తండ్రి వాపోయారు. మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు, రవీందర్ రెడ్డిలు తమ కూతురును చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని స్వాతి తండ్రి తెలిపారు. మధుకర్ రెడ్డి తల్లిదండ్రుల మద్దతుతోనే రవీందర్ రెడ్డి తమను బతకనివ్వమంటూ బెదరిస్తున్నాడని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

హార్పిక్ తాగింది, స్వాతి పరిస్థితి విషమం: వైద్యులు

హార్పిక్ భారీ మొత్తంలో తాగడంతో స్వాతి శరీర అంతర్భాగాల్లో తీవ్రగాయాలయ్యాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం స్వాతి పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. రక్త స్రావమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు కోలుకున్నా.. భవిష్యత్‌లో అన్నవాహిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+