‘టికెట్’ ఘర్షణ: రెచ్చిన లేడీ కానిస్టేబుల్, కండక్టర్ ఫైట్, వీడియో వైరల్
ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం ఓ లేడీ కానిస్టేబుల్, కండక్టర్ మధ్య పెను వివాదానికి దారితీసింది. డ్రెస్‌లో ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మహిళ పోలీస్ కానిస్టేబుల్ వాదించగా..
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం ఓ లేడీ కానిస్టేబుల్, కండక్టర్ మధ్య పెను వివాదానికి దారితీసింది. డ్రెస్‌లో ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని మహిళ పోలీస్ కానిస్టేబుల్ వాదించగా.. టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టడంతో ఈ వివాదం ఘర్షణకు దారిటీసింది.

ఆర్టీసీ బస్సులోనే..
మహబూబ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కారు. ఆ బస్సు కండక్టర్ గా శోభారాణి పని చేస్తున్నారు.

టికెట్ అడగడంతోనే..
బస్సు బోయపల్లిగేట్ దాటిన తరువాత టికెట్లిస్తున్న కండక్టర్.. కానిస్టేబుల్‌ను సమీపించి టికెట్ అడిగారు. దానికి కానిస్టేబుల్ రజితకుమారి తనవద్దనున్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించారు.

రాజుకున్న వివాదం
అయితే అది ఒరిజనల్ కాదని, దానిని పరిగణనలోకి తీసుకోమని, పోనీ వారెంట్ ఉంటే చూపించాలని కండక్టర్ అడిగారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ దారితీసింది..

విరుచుకుపడ్డ కానిస్టేబుల్
కానిస్టేబుల్‌ను బయటికి లాగేందుకు కండక్టర్ ప్రయత్నించగా.. ఆ కానిస్టేబుల్ మాత్రం కండక్టర్‌పై దాడి చేసింది. దీంతో కండక్టర్ సీట్లో చతికిలబడిపోయింది. కాగా, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. కాగా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఈ వివాదం అక్కడే పరిష్కారమైంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications