మ‌హాకూట‌మి..! కొంచెం దీని అడ్ర‌స్ చెప్తారా బాబు.. ప్లీజ్..!!

హైదరాబాద్ : దేశంలో కొన్ని సంఘ‌ట‌న‌లు ఉరుములా వ‌చ్చి మెరుపులా మాయమ‌వుతుంటాయి. ముఖ్యంగా రాజ‌కీయాల్లో పార్టీలు, అభ్య‌ర్తులు, పొత్తుల విష‌యంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌రుచుగా జ‌రుగుతుంటాయి. 'మ‌హాకూట‌మి' తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఈ పేరు మారు మోగి పోయింది. ఏ నోట విన్నా, ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పేప‌ర్ తిర‌గేసినా, ఏ వెబ్ సైట్ లోకి వెళ్లినా ఇదే గోల‌.

కాని మూడు నెల‌లు తిర‌క్కుండానే ఆ పేరు క‌నుమ‌రుగయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల క్రితం మారుమోగిన మహా కూటమి అనే పదం ఇప్పుడు విన్పించడం లేదు. ఆ పేరు ఎత్తే సాహసం కాంగ్రెస్ నాయకులే కాదుక‌దా కూట‌మిలో భాగ‌స్వామ్యం ఐన ఏ పార్టీలు చేయ‌డం లేదు. అక‌స్మాత్తుగా అంత మార్పు రావ‌డానికి మొన్న జరిగిన ముంద‌స్తు అసెంబ్లీలో ఎన్నికల్లో కూటమి ప్రయోగం భ‌యంక‌రంగా బెడిసికొట్ట‌డ‌మే కారణంగా తెలుస్తోంది..! గత ఎన్నికల్లో పరాభవం దృష్ట్యా ఈసారి కూటమి కట్టేందుకు ఏమాత్రం సాహ‌సం చేయ‌డం లేదు రాజ‌కీయ పార్టీలు.

Mahakutami..! please tell the address where it is in Telangana..!!

మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏ. రేవంత్ రెడ్డి జన సమీకరణతో పాటు, వివిధ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కూటమి లేకపోయినా తన విజయానికి సహకారం అందించాల్సిందిగా ఆయన స్వయంగా సీపీఐ, తెలంగాణ జనసేన, టీడీపీ నేతలను కలుసుకుని కోరుతున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. కోదండరామ్ నివాసానికి రేవంత్ వెళ్ళి తనకు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. మద్దతు విషయంపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ హామీ ఇచ్చారు.

సీపీఐ రాష్ట్ర నేతలతో చర్చించి మద్దతు పొందారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డితో రేవంత్ చర్చించారు. అయితే కూటమి లేనందున, అధికారికంగా తాము మద్దతునివ్వలేమని, స్థానికంగా మద్దతు కూడగట్టుకోవాలని టీడీపీ నేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో మ‌హా కూట‌మి అనే ప‌దం తెలంగాణ రాజ‌కీయాల్లో అంత‌రించిపోయే ద‌శ‌కు చేరుకున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+