మహానాడు స్టిక్కర్‌తో రేవంత్‌కు చిక్కు, తెరాస దాడిని 'కట్' చేశారు!
హైదరాబాద్: మహానాడు స్టిక్కర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కొంప ముంచిందా? అంటే అవుననే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య అంటున్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పైన విజయవాడ సత్యనారాయణపురంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అందులో ఆయన ఆసక్తికర అంశాలు పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన స్టీఫెన్ సన్‌ను టీఆర్ఎస్ అవమానించిందని, నొచ్చుకున్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
ఆ విషయం తెలిసి తాను క్రైస్తవ దళిత సంఘ నాయకుడిగా సెబాస్టియన్‌తో సంప్రదింపులు జరిపానని చెప్పారు. మహానాడు స్టిక్కర్ అంటించి ఉన్న కారులో స్టీఫెన్ సన్ ఇంటికి సెబాస్టియన్ వెళ్లారని, స్టీఫెన్ గన్‌మెన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలకు ఈ సమాచారం అందిందని చెప్పారు.

ఆ వెంటనే హైదరాబాద్ పోలీసులు, నిఘా వర్గాలు వచ్చాయని, ప్రభుత్వం చివరి సమయంలో ఏసీబీని రంగంలోకి దించిందని మత్తయ్య పేర్కొన్నారు. అప్పటికే ఫోన్ ట్యాపింగ్, సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియో రికార్డింగ్ అయి ఉండటంతో, ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పకడ్బంధీగా వ్యూహం పన్నారన్నారు.
ప్రణాళిక ప్రకారమే వచ్చిన తెరాస వర్గాలు రేవంత్ రెడ్డి పైన దాడి చేసేందుకు యత్నించాయన్నారు. పోలీసు వర్గాలు సైతం తెరాస శ్రేణుల దాడిని వీడియోలో కట్ చేసి, రేవంత్ రెడ్డి తొడగొట్టి మీసం మెలేసిన దృశ్యాలనే మీడియాకు విడుదల చేశారని పేర్కొన్నారు.
ఏసీబీ అధికారుల సమక్షంలోనే తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డి పైన దాడికి యత్నించారని, దానికి రేవంత్ ధీటుగా సమాధానం చెప్పారని, ఈ క్రమంలోనే ఆయన మీసం మెలేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం కెమెరాల్లో రికార్డయిందన్నారు. కానీ, వాటిని తొలగించారన్నారు. రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications