ప్రేమించి పెళ్ళి: లవ్ యూ బుజ్జి అంలూ సూసైడ్ , కారణమిదే!

హైదరాబాద్: మూడేళ్ళపాటు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొన్నారు. ఒకరు లేకుంటే మరోకరు ఉండలేనంతగా ప్రాణంగా ప్రేమించుకొన్నారు.పెద్దలను ఎదిరించి పెళ్ళిచేసుకొన్నారు. మూడు నెలలు కాపురం చేశారు.అయితే పండుగకు పుట్టింటికి వెళ్ళఇన భార్య ఇంటికి రాకపోవడం, భార్య తరపువారు బెదిరించడంతో మనోవేదనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు.

మహాబూబ్ నగర్ జిల్లా కేశంపేటకు చెందిన తలసారి రాంరెడ్డి తన భార్య ఇద్దరు కుమారులతో కర్మన్ ఘాట్ నిర్మలానగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఓలా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంల నెవ్వెంల చెందిన స్రవంతి చంపాపేటలోని తన బాబాయి రవీందర్ రెడ్డి ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అయితే వరుసకు మామ అయిన రవీందర్ రెడ్డి ఇ:టికి మహేందర్ రెడ్డి తరచూ వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే మూడేళ్ళ క్రితం స్రవంతితో మహేందర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది.

Mahendar reddy commits suicide in Hyderabad.

ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్ళిచేసుకోవాలని భావించారు.అయితే ఈ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు.దీంతో గత ఏడాది సెప్టెంబర్ 19న, ఆర్యసమాజ్ లో మహేందర్ రెడ్డి, స్రవంతిలు పెళ్ళిచేసుకొన్నారు.వేరు కాపురం పెట్టారు.

మూడు మాసాల పాటు బాగానే కాపురం చేశారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళింది స్రవంతి. పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలని కోరితే ఆమె నుండి స్పందన రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయాడు మహేందర్ రెడ్డి.పెద్దల సమక్షంలో రెండు దఫాలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.అంతేకాదు తమ అమ్మాయి జోలికి వస్తే అంతుచూస్తామని బెదిరింపులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఐలవ్ యూ బుజ్జి ...లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలంటూ మహేందర్ రెడ్డి సూసైడ్ లేఖ రాశాడు. ప్రేమ పేరిట మోసం చేయొద్దు..ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. ప్రాణంగా ప్రేమించిన తర్వాత చాలా మంది ప్రాణాలు తీసుకొంటారు. దయచేసి ప్రేమలో నిజాయితీగా ఉండాలని ఆయన ఆ లేఖలో రాశాడు. తల్లిదండ్రులను, స్నేహితులకు క్షమాపణలు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+