హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాచకొండ కమిషనర్ భగవత్ ఘనత: కెనడా సంస్థ ఇన్‌ఫ్లుయెన్స్ లీడర్స్ జాబితాలో చోటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఘనత సాధించారు. లైంగిక అక్రమ రవాణా నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు యాంటీ ట్రాఫికింగ్‌లో చోటు దక్కింది. లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కెనడాకు చెందిన అసెంట్‌ సాఫ్టువేర్‌ అండ్‌ డేటా సంస్థ వెలువరించిన 2017 టాప్‌ 100 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అండ్‌ స్లేవరీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లీడర్స్ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. లైంగిక అక్రమ రవాణా, ఆధునిక బానిసత్వం నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న వంద మంది జాబితాను ఈ సంస్థ ఎంపిక చేసింది.

Mahesh Bhagwat shines in anti-trafficking job

అసెంట్ సాఫ్టువేర్ అండ్ డేటా సంస్థ తరఫున యూనివర్సిటీ ఆఫ్ నోటర్ డేమ్ ఎంబీయే లూకాస్ టేలర్ ఈ నివేదికను తయారు చేశారు. ఈ జాబితాలో మహేష్ భగవత్‌కు 47వ స్థానం దక్కింది.

తెలంగాణ కేడర్‌కు చెందిన ఈ ఐపీఎస్‌ అధికారి పదమూడేళ్లుగా లైంగిక అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మహేష్ భగవత్‌కు గతంలో యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ 2017 ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్‌ రిపోర్ట్‌ హీరో పురస్కారం దక్కించుకున్నారు.

English summary
Rachakonda police commissioner Mahesh Bhagwat’s work to curb human trafficking has received another international recognition. Mr Bhagwat has been has been listed in the 100 Human Trafficking and Slavery Influence Leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X