చిరంజీవికి అలా చెప్పి ఎక్కడ దాక్కున్నావ్: రేణుని లాగి పవన్‌పై మహేష్ కత్తి, దుమ్ముదులిపిన రాంకీ

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అభిమానులతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తి తాజాగా మరోసారి జనసేనానికి సవాల్ విసిరారు. ఓ ఛానల్ వేదికగా ఛాలెంజ్ చేశారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేణు దేశాయ్‌ను కూడా లాగారు.

మిస్టర్ పవన్ కళ్యాణ్, పుణేలో రేణు దేశాయ్ ఇంటికి నువ్వు ఎప్పుడైనా వెళ్లావా అని, పుణేలో ఫోర్ సీజన్స్ అనే ఓ హోటల్ ఉందని, ఇక్కడ చిరంజీవికి , మీ అమ్మగారికి అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, నువ్వు ఎక్కడకు వెళ్లి దాక్కున్నావని ప్రశ్నించారు. నువ్వు అక్కడకు వెళ్లి ఎక్కడ దాక్కునేవాడివి మిస్టర్ పవన్ అని అడిగారు.

వుమనైజర్ అని విమర్శలు

వుమనైజర్ అని విమర్శలు

పవన్ కళ్యాణ్‌పై నిత్యం విమర్శలు చేస్తున్న మహేష్ కత్తిపై సర్వత్రా ఎదురుదాడి వినిపిస్తోంది. సినిమా పరిశ్రమలోను చాలామంది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని, ఉద్దేశ్యపూర్వకంగా ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత రాంకీ.. మహేష్ కత్తిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వుమనైజర్ అనే విధంగా మాట్లాడారు.

ఆధారాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు

ఆధారాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు

తాజాగా, శుక్రవారం కూడా ఆయన మహేష్ కత్తి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. అమ్మాయిలతో మహేష్ కత్తి ఏ రకంగా వ్యవహరిస్తారనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కానీ వాటిని చూపించి పెద్దవి చేయడం తనకు ఇష్టం లేదని రాంకీ అన్నారు. ఈ ఆధారాలు ఎవరైతే తనకు ఇచ్చారో వాళ్లకు కూడా ఇష్టం లేదన్నారు. తనకు కావాల్సింది ఈ సమస్యలు ఇంతటితో ఆగిపోవాలన్నారు. ఆగిపోని రోజు, అవసరమైన రోజు అప్పుడే బయటకు చూపించవచ్చునని చెప్పారు.

అభిమానులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పా

అభిమానులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పా

తనకు ఆ ఆధారాలు ఎలా వచ్చాయో కూడా రాంకీ చెప్పారు. తాను వెబ్ ఛానల్‌లో మహేష్ కత్తి పద్ధతి బాగా లేదని చెప్పానని, ఇలా చేయవద్దని హితవు పలికానని, ప్రేక్షకులను, అభిమానులను ఇబ్బంది పెట్టవద్దని సూచించానని, లేదా పవన్ అభిమానుల్ని ఇబ్బందులకు గురిచేయవద్దని చెప్పానని అన్నారు.

అలా ఆధారాలు తన వద్దకు వచ్చాయి, భార్యపై మాట్లాడతారా

అలా ఆధారాలు తన వద్దకు వచ్చాయి, భార్యపై మాట్లాడతారా


తాను ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి, కొందరు ఆధారాలు ఇచ్చారని రాంకీ చెప్పారు. మహిళలు అంటే మహేష్ కత్తికి గౌరవం లేదన్నారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్‌ను ఎత్తి చూపడం ఎంత వరకు సమంజసం అన్నారు. పవన్ భార్యపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని రాంకీ ప్రశ్నించారు. మహిళలకు మహేష్ కత్తి మీద ఎలాంటి గౌరవం ఉందో చెప్పడానికి ఈ ఆధారం చాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+