Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ ఏమిటో నాకే తెలుసు, చెబితే వినట్లేదు: మహేష్ కత్తి ఆసక్తికరం

ఖమ్మం: తెలంగాణలో ప్రజాయాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్నారు. ఉదయం కొత్తగూడెం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడకు చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వేల సంఖ్యలో వాహనాలు అనుసరించాయి.

Recommended Video

    Pawan Kalyan Khammam tour : పవన్ కళ్యాణ్‌ పైకి చెప్పు, గందరగోళం : వీడియో

    తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఖమ్మం పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా కారణమని చెప్పారు. తనపై ఎవరు దాడి చేసినా సహిస్తానని, ఎదురు దాడి చేయనని చెప్పారు. నాపై దాడిని సద్విమర్శగా తీసుకుంటానని చెప్పారు.

    పవన్ కళ్యాణ్ పదేపదే

    పవన్ కళ్యాణ్ పదేపదే

    మంగళవారం కరీంనగర్‌లోను పవన్ ఇదే చెప్పారు. తనపై ద్వేషం ఉన్న వారి గురించి ఆలోచించేందుకు తనకు సమయం లేదని చెప్పారు. తనను అభిమానించే వారు గురించి మాత్రమే తాను ఆలోచిస్తానని చెప్పారు. రెండు రోజులుగా ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు మహేష్ కత్తిని ఉద్దేశించే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కత్తి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పవన్ గురించి ఆయన కంటే నాకే ఎక్కువగా తెలుసు

    పవన్ గురించి ఆయన కంటే నాకే ఎక్కువగా తెలుసు

    ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై పొలిటికల్ సెటైర్ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నట్లు మహేష్ కత్తి తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన కంటే తనకే ఎక్కువగా తెలుసునని చెప్పారు. ఆయన గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తిని తానే అని చెప్పారు. పవన్‌కు తన గురించి మాత్రమే తెలుసునని, కానీ దేశంలో ఆయన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో తనకు తెలుసునని చెప్పారు.

    పవన్ కళ్యాణ్ ఏమిటో నాకు మాత్రమే తెలుసు

    పవన్ కళ్యాణ్ ఏమిటో నాకు మాత్రమే తెలుసు

    పవన్ కళ్యాణ్ ఏమిటో తనకు మాత్రమే తెలుసునని మహేష్ కత్తి అన్నారు. పవన్ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, ఇక పవన్‌కు తాను రోజు సలహాలు ఇస్తుంటానని చెప్పారు. కానీ ఆయన స్వీకరించడం లేదన్నారు.

    పవన్ పైన విమర్శలు

    పవన్ పైన విమర్శలు

    కాగా, పవన్ కళ్యాణ్‌పై నిత్యం విమర్శలు చేస్తూ మహేష్ కత్తి ఇటీవల బాగా హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన హైదరాబాదులోని బుక్ ఫెయిర్‌లో పవన్ పైన రాసిన పుస్తకం కొనడం కూడా ఆసక్తిని కలిగించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+