వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైట్ ముగియలేదని కోన వెంకట్: సరెండర్ చేయనని కత్తి మహేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

కత్తికి థ్యాంక్స్.. కానీ అప్పుడే అయిపోలేదు..!

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో చెలరేగిన వివాదం పలు మలుపులు తిరిగి చివరకు రాజీ దాకా వచ్చింది. అయితే, మహేష్ కత్తి దిగివచ్చారా, పవన్ కల్యాణ్ అభిమానులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి తగ్గారా అనేది ప్రశ్న.

అయితే, ఇరు వైపులా వివాదం మరింత చెత్తగా మారకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తల్లో భాగంగానే రాజీలాంటిది కుదిరిందని భావిస్తున్నారు. మహేష్ కత్తి ఇక పవన్ కల్యాణ్ జోలికి వెళ్తారా, లేదా అనేది సందేహంగానే ఉంది.

ఎక్కడా సరెండర్ చేయను

ఎక్కడా సరెండర్ చేయను

తన పోరాటమంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కును పరిరక్షించుకోవడానికి చేసిందేనని, అది ఎక్కడా సరెండర్ చేయనని, నోరు మూసుకునే అవసరంం లేదని మహేష్ కత్తి తాజాగా అన్నారు.

ఇక వ్యక్తులను టార్గెట్ చేయను...తాను వ్యక్తులను టార్గెట్ చేయడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి తన అభిప్రాయాలను ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటానని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. వ్యవహారంలోకి పూనమ్ కౌర్‌ను, త్రివిక్రమ్‌ను లాగి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దాడి చేశాననే ఆలోచన రావడం వల్లనే మహేష్ కత్తి మెట్టు దిగారని అనిపిస్తోంది. (mahesh

ఇక వ్యక్తులను టార్గెట్ చేయను...తాను వ్యక్తులను టార్గెట్ చేయడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి తన అభిప్రాయాలను ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటానని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. వ్యవహారంలోకి పూనమ్ కౌర్‌ను, త్రివిక్రమ్‌ను లాగి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దాడి చేశాననే ఆలోచన రావడం వల్లనే మహేష్ కత్తి మెట్టు దిగారని అనిపిస్తోంది. (mahesh

తాను వ్యక్తులను టార్గెట్ చేయడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి తన అభిప్రాయాలను ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటానని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. వ్యవహారంలోకి పూనమ్ కౌర్‌ను, త్రివిక్రమ్‌ను లాగి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దాడి చేశాననే ఆలోచన రావడం వల్లనే మహేష్ కత్తి మెట్టు దిగారని అనిపిస్తోంది.

మహేష్ కత్తికి కోన వెంకట్ థ్యాంక్స్

మహేష్ కత్తికి కోన వెంకట్ థ్యాంక్స్

మహేష్ కత్తికి కోన వెంకట్ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులతో మహేష్ కత్తి దిగిన ఫొటోను పోస్టు చేశారు."ఈ ఇష్యూకి ఎప్పటికీ ముగింపు పలికేందుకు ముందుకు వచ్చిన కత్తి మహేష్‌కు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇక ముందు నీపై ఎవరూ దూషణలకు పాల్పడరు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారు పీకేకు శత్రువులతారు. నన్ను నమ్ము" అని కోన వెంకట్ అన్నారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కోన వెంకట్ సూచన

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కోన వెంకట్ సూచన

"ఫైట్ ముగియలేదు ఫ్రెండ్స్... పవన్ కల్యాణ్ తన గోల్‌ని చేరుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. మీరు నిజంగా ఆయనయ ేలు కోరేవారైతే ప్రశాంతంగా ఉండండి. ఆయన ఆశయాలకు,సిద్ధాంతాలకు ప్రతినిధులుగా ఉండండి. అలాగే ఆయన వ్యక్తిత్వానికి మీరు ప్రతిబింబమన్నట్టుగా సమాజానికి భరోసా ఇవ్వండి" అని కోన వెంకట్ పవన్ కల్యాణ్ అభిమానులకు సూచించారు.

English summary
Mahesh Kathi said that he will not close his mouth, but keep away from personal attack. Kona Venakt sais thanks to Mahesh Kathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X