టిఆర్ఎస్‌లో కుమ్ములాట: ఎమ్మెల్యే తీగలపై గులాబీ కేడర్ ఆగ్రహం
హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి పైన గులాబీ క్యాడర్ భగ్గుమంటోందని వార్తలు వస్తున్నాయి. తీగల పైన స్థానిక కార్యకర్తలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
తీగల తీరు పైన మహేశ్వరం మండల టిఆర్ఎస్ అధ్యక్షులు కూన యాదయ్యతో పాటు పలువురు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.
పైగా మీ అందరి గురించి నాకు తెలుసునని, ఏం చేసుకుంటారో చేసుకోమని ఎమ్మెల్యే తమ పైన ప్రతిదాడి చేస్తున్నారని ఆరోపించారు. తాగునీటి ఎద్దడి పైన చర్చించేందుకు సోమవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులతో ఎమ్మెలయే తీగల భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి మహేశ్వరం అధ్యక్షులు కూన యాదయ్య వచ్చారు. ఈయన మాట్లాడుతూ... అధికారులు పార్టీ నేతలకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... ఇది పార్టీ సమావేశం కాదని, తాగునీటిపై మాట్లాడాలని సూచించారు.
దీనిపై టిఆర్ఎస్ నాయకులు కొందరు ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. భేటీలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే తీగల పైన సీఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేయాలని స్థానిక నేతలు నిర్ణయించారని తెలుస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications