మహమూద్ అలీకి హోంశాఖ కేటాయింపు, కేసీఆర్ నిర్ణయం

హైదరాబాద్: తనతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాఖను కేటాయించారు. ఆయనకు హోంశాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలో మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

అప్పుడు నాయిని నర్సింహా రెడ్డి హోంమంత్రిగా చేశారు. ఇప్పుడు ఆ శాఖను అలీకి కేటాయించారు. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కేసీఆర్‌, మహమూద్‌ అలీ చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. త్వరలో మంత్రివర్గాన్ని కేసీఆర్‌ విస్తరిస్తారు. జిల్లాల వారీగా సామాజిక కసరత్తును పూర్తి చేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

Mahmood Ali is allotted home ministry by CM KCR

కాగా, రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌కు అభినందనలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

ఐఏఎస్‌లు, అధికారులు, సినీ ప్రముఖులు ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎస్‌ అధికారులు సజ్జనార్‌, అంజనీ కుమార్‌ సహా పలువురు కేసీఆర్‌ను కలిశారు.సినీనటులు అలీ, సీనియర్‌ నరేశ్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+