మైనంపల్లి రూటే సపరేటు - హామీ దక్కిందా, నెక్స్ట్ స్టెప్ అటే..!!
బీఆర్ఎస్ పార్టీ(BRS)కి మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) రాజీనామా చేశారు. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తరువాతనే తన నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటుగా తన కుమారుడికి సీటు ఇవ్వాలనేది మైనంపల్లి డిమాండ్. మైనంపల్లికి మాత్రమే సీటు ఖరారు కావటంతో ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో రెండు సీట్ల హామీతో మైనంపల్లి పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియోలో ప్రకటించారు. తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తాను. ఇంతవరకు అందించిన అందరి సహకారానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను. మల్కాజ్‌గిరి(Malkajgiri) ప్రజలకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను.. దేనికి లొంగే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్(Congress) గూటికి చేరుతున్నట్టు తెలుస్తోంది. తన కుమారుడు రోహిత్‌కి మెదక్ అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ పైన, మంత్రి హరీష్ రావుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే నాటికే మైనంపల్లి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తనకు రెండు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ లో చేరుతాననే మైనంపల్లి ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దాదపు అన్నిరకాల చర్చలు పూర్తి కావడంతో మైనంపల్లి హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు సమాచారం.
మంత్రి హరీష్ పైన మైనంపల్లి వ్యాఖ్యల సమయంలోనే పార్టీ నుంచి చర్యలు తీసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే, అదే సమయంలో మైనంపల్లి(Mainampalli)కి టికెట్ ఖరారు చేసారు. దీంతో. మైనంపల్లి నిర్ణయం తీసుకొనే వరకు వేచి చూడాలని భావించారు. హరీష్ పైన మైనంపల్లి వ్యాఖ్యలను అప్పట్లోనే సీఎం కేసీఆర్, కేటీఆర్(KTR) తప్పు బట్టారు. మైనంపల్లి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని అప్పటికే బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది. ఇక, టికెట్ రద్దు చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పుడు మైనంపల్లి రాజీనామాతో మరొకరిని అక్కడ అభ్యర్దిగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ వారంలోనే మైనంపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications