తెలంగాణలో భారీ ఎయిర్ పోర్ట్- శంషాబాద్ కు ధీటుగా: నిధులు సైతం విడుదల
తెలంగాణలో మరో భారీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకానుంది. దీనికి సంబంధించి నిధులు సైతం విడుదల అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా, అత్యాధునిక సౌకర్యాలతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపర్చినట్టవుతుంది.
ప్రతిపాదిత విమానాశ్రయం పెద్దాపల్లి జిల్లాలోని అంతర్గాంలో ఏర్పాటు కానుంది. ఇది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం. దీని అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపునకు పాలనాపరమైన ఆమోదం తెలిపింది. దీనికోసం 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీవో విడుదల చేశారు.

రాష్ట్రంలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ను తయారు చేయడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీని కన్సల్టెంట్‌గా నియమించింది. గతంలో పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ వద్ద గుర్తించిన స్థలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని అథారిటీ తేల్చి చెప్పింది. దీంతో అదే జిల్లాలోని అంతర్గాంలో స్థలాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక్కడ 591.24 ఎకరాల భూమిని జిల్లా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన డాక్యుమెంట్లను ఏఏఐకి అందజేశారు. ప్రతి సైట్‌కు ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కన్సల్టెన్సీ ఫీజు మొత్తం 40,52,946 రూపాయలుగా ఢిల్లీలోని ఏఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్కిటెక్చర్) నిర్ణయించారు. తాజాగా 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రామగుండం విమానాశ్రయ ప్రాజెక్టులో ముందడుగు పడినట్టయింది.
ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ,, సింగరేణి ఉద్యోగులు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను సృష్టిస్తుందని అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications