చేతగాక పార్టీని అమ్ముకున్నారు: చిరంజీవిపై మాల మహానాడు భగ్గు
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు గాను కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై మాల మహానాడు భగ్గుమంటోంది. చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వబోమని మాల మహానాడు హెచ్చరించింది. చిరంజీవికి వ్యతిరేకంగా సోమవారం మాల మహానాడు ఆందోళన చేపట్టింది.

హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

మాల మహానాడు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయం చేతగాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సిఫార్సు చేయడం చేతగాని తనమని మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు.












Click it and Unblock the Notifications