ఫేక్ ఐడీలతో అమ్మాయిలకు టార్చర్!: టీఆర్ఎస్ కార్పోరేటర్ తనయుడి అరెస్ట్..
అమ్మాయిలను వేధిస్తున్న జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు అభిషేక్ గౌడ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అభిషేక్ పలువురు అమ్మాయిలను అసభ్య సందేశాలతో వేధించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: అమ్మాయిలను వేధిస్తున్న జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు అభిషేక్ గౌడ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అభిషేక్ పలువురు అమ్మాయిలను అసభ్య సందేశాలతో వేధించినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్ ఎన్.జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఐడీలు సృష్టించుకున్నాడు. ఆ ఐడీలతో యువతులకు అసభ్య సందేశాలు పంపించడం, బెదిరించడం వంటివి చేస్తున్నాడు.ఇటీవలి కాలంలో అతని వేధింపులు ఎక్కువ కావడంతో ముగ్గురు యువతులు షీటీమ్స్ కు ఫిర్యాదు చేశారు.

అభిషేక్ తో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిషేక్ ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం వేట కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications