రాహుల్ గాంధీ కారులో మల్లు భట్టి విక్రమార్క: కీలక సూచనలు

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఖమ్మంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో పాటు బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగం జిల్లా పార్టీలోనేగాక, రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలకు మరింత బలాన్నిచ్చినట్లయింది. కర్ణాటకలో అధికారం చేపట్టడంతో తెలంగాణలో కూడా ఆ దిశగా నేతలు అడుగులు వేస్తున్నారు.

కాగా, ఖమ్మంలో బహిరంగ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీతో ఆయన కారులో సీనియర్ నేత భట్టి విక్రమార్క గన్నవరం వరకు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తన పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

Mallu Bhatti Vikramarka travelled in Rahul Gandhis car after khammam public meeting

కాగా, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన నేపథ్యంలో ఖమ్మం సభలో భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ భుజం తట్టి అభినందించిన విషయం తెలిసిందే. సభకు భారీగా హాజరైన కార్యకర్తలు, ప్రజల సమక్షంలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించారు. మరింత ముందుకు సాగాలంటూ మెచ్చుకున్నారు. కాగా, భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.

కాగా, ఖమ్మం బహిరంగ సభలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఒక్కటిగా కనిపించడం గమనార్హం. బేధాభిప్రాయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ గెలుపుకోసమే తాము పనిచేస్తామన్నట్లు సభ వేదికపై నాయకులంతా కనిపించారు. ఆదివారం గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు రాహుల్ గాంధీ. అప్పటికే కాంగ్రెస్ నేతలంతా వేదికపై.. భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలంతా సభా ప్రాంగణంలో కనిపించారు. రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ నేతల కటౌట్లు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో ప్రాంగణం కళకళలాడింది.

ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని వ్యాఖ్యానించారు. అంతేగాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలకు ఏం చేస్తామనేదానిపైనా స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్ ప్రసంగం, సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+