నల్లగా ఉన్నావ్, చచ్చిపో, వేరే పెళ్లి చేసుకుంటా: భార్యపై భర్త
హైదరాబాద్: ఓ వ్యక్తి తన భార్యను వింత పద్దతిలో వేధించడం ప్రారంభించాడు. "నల్లగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు చచ్చిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటా" అంటూ వేధించదడం ప్రారంభించాడు. అంతేకాదు, "నీ అంతట నవ్వు చచ్చిపోకపోతే నేను చంపేస్తాన"ని హత్యాయత్నం కూడా చేశాడు.
దాంతో మహిళ తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళ భర్తను, అతనికి సహకరించిన సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ప్రభు ధర్మాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి (22)ని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పుడు కనిపించని అంద విహీనం ఆమెలో అతనికి ఇప్పుడు కనిపించింది. దాంతో లక్ష్మిని తీవ్రంగా వేధిస్తూ వస్తున్నాడు.
ఈ నెల 18వ తేదీన సోదరుడు ఎల్లయ్యతో కలిసి ఆమెపై హత్యాయత్నం చేశాడు. దీంతో లక్ష్మి తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభును, ఎల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications