మహిళలు స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియోలు.. ఐదేళ్లుగా ఇదే పని !

మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. బహిరంగ ప్రదేశాలలో, నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలపై ఆకృత్యాలు జరుపుతున్న ఘటనలను, నేరాలకు పాల్పడడాన్ని గమనించవచ్చు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే ఘటన ఏకంగా నివాస ప్రాంతాల్లోనే చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మధురానగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక కమ్యూనిటీ హాల్‌లో కొన్ని సంవత్సరాలుగా ఒక కుటుంబం విధులు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన యువతి సమీపంలోని చీరల షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఆమె విధులకు వెళ్లే ముందు స్నానం చేసేందుకు వాష్ రూం కి వెళ్లింది.

అక్కడ సబ్బు కోసం వెతుకుతుండగా ఆమెకు అకస్మాత్తుగా మొబైల్‌ ఫోన్ తగిలింది. ఈ ఘటనతో ఆమె భయాందోళనకు గురై, వెంటనే దుస్తులు ధరించి బయటకు వచ్చి చూసేసరికి.. అక్కడే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న వై. మరియాలి కుమార్ స్నానం గది పక్కన దాక్కుని కనిపించాడు.

man-arrested-for-taking-photos-and-videos-of-women-bathing-in-hyderabad

వెంటనే ఆమె ఈ విషయం తన భర్తకు తెలియజేయగా.. అతను వచ్చి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే మరియాలి అప్పటికే తన మొబైల్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు సంఘటన వివరాలను సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డికి తెలియజేయగా.. వారు మరియాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే గత ఐదేళ్లుగా మహిళలు స్నానం చేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తూ వారిని వేధిస్తున్నని పోలీసుల విచారణలో అంగీకరించాడు.

తన మొబైల్‌లో ఉన్న డేటాను తానే తొలగించానని ఒప్పుకున్నాడు. అయితే డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సహాయంతో పోలీసులు మిగతా వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో నడిబొడ్డున కూడా ఈ తరహా ఘటనలు జరగడం మహిళల భద్రతపై అనుమానాలను లేవనెత్తుతోంది. నివాస ప్రాంతాలు, కమ్యూనిటీ హాల్‌లు, బాత్‌రూమ్‌లు వంటి ప్రైవేట్ ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+