‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అంటూ కాల్ చేసి రూ. లక్షలకు టోపీ: అరెస్ట్
హైదరాబాద్: బాగా జనాదరణ పొందిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని లాటరీ గెల్చారంటూ లక్షలు కాజేసిన ఓ మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం లాటరీలో రూ.25 లక్షలు గెల్చారంటూ.. హైదరాబాదీ ఆటోడ్రైవర్‌కు కాల్ చేశాడు.
అనంతరం అతనికి రూ.3.60 మేర కుచ్చుటోపీ పెట్టిన కోల్‌కతా విద్యార్థిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ హౌరాలోని బోస్‌రోడ్‌కు చెందిన విద్యార్థి పింటూ కుమార్ రాయ్ కేబీసీ పేరుతో దేశవ్యాప్తంగా బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపుతుంటాడు.

తన వలలో పడినవారికి మాయమాటలు చెప్పి తన ఖాతాలో నగదు వేయించుకుంటుంటాడు. ఈ క్రమంలోనే.. నగరానికి చెందిన నగేష్ అనే ఆటో డ్రైవర్ ఇతడి వలలో చిక్కి రూ.3.60 లక్షలు పింటూ ఖాతాలో వేశాడు.
అనంతరం ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఆటో డ్రైవర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి, కోల్‌కతాకు వెళ్లి పింటూను అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారంట్‌తో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications