సాఫ్ట్‌వేర్ జాబ్స్: తోటి మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేసి బంధించి లైంగిక వేధింపులు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని టోలిచౌక్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. యువతిని తోటి ఉద్యోగి ఇమాద్ కిడ్నాప్ చేశాడు. మూడు రోజులు పాటు ఆమెను బంధించి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.

యువతి పోన్ ద్వారా తన సోదరుడికి సమాచారం అందించింది. షీటీమ్స్ సహాకారంతో సోదరుడు యువతిని రక్షించాడు. యువతిని బంధించిన ఇమాద్‌ను షీటీమ్స్ బృందం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాద్‌లోని డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన యువతి (24) దుబాయ్‌లో ఉద్యోగం రావటంతో ఆరు నెలలక్రితం అక్కడికి వెళ్లింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తోటి ఉద్యోగి సయ్యద్ ఇమద్ (26)తో సన్నిహితంగా మెలిగింది.

దానితో ఆమెపై మోజుపడ్డ ఇమద్ దుబాయ్ వెళ్లిన యువతిని బెదిరింపులకు గురిచేసి హైదరాబాద్ రప్పించాడు. అనంతరం ఆమెను టోలిచౌకీలోని ఓ ఫ్లాట్‌లో నిర్బంధించాడు. చెప్పినమాట వినాలని లేకపోతే చంపేస్తానని కత్తి, పెట్రోల్ డబ్బా చూపిస్తూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అతను లేని సమయంలో ఆ యువతి బెంగళూరులో ఉన్న తన సోదరుడి ఫోన్‌కి బందీ దృశ్యాలను పంపించింది.

సోమవారం హైదరాబాద్ చేరుకున్న సోదరుడు షీ టీమ్స్ చీఫ్ స్వాతిలక్రను సంప్రదించాడు. వెంటనే ఆమె నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి యువతిని నిర్బంధించిన ఫ్లాట్‌పై దాడి చేశాయి. షీ టీమ్స్ ఇంట్లో అణువణువూ తనిఖీ చేయటంతో బాత్‌రూమ్‌లో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ యువతి కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గదిలో పెట్రోల్ డబ్బా, తాడు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హుమాయూన్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

Man arrested for sexually assaulting a girl

వ్యక్తిపై కత్తితో దాడి

ఇదిలావుంటే, హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంషీగూడ గ్రామం మహంకాళినగర్‌లో ఓ వ్యక్తిపై అగంతకుడు కత్తితో దాడి పారిపోయాడు. శంషీగూడ, మహాంకాళినగర్‌కు చెందిన ఎం. రమేష్(46)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్‌ను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది సుదర్శన్, పాషా బాధితుడికి ప్రథమ చికిత్స చేసి గాంధీకి తరలించారు. రమేష్ అందించిన సమాచారం మేరకు నిందితుడిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+