వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేయాలి: లోన్ ఇవ్వండంటూ బ్యాంకుకు దరఖాస్తు
హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక బరిలో నిల్చొంటున్నానని, అందుకుగానూ తనకు లోన్ మంజూరు చేయాలని ఓ వ్యక్తి కెనరా బ్యాంకును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాదులో జనసంక్షేమ సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన వెంకట నారాయణ అనే పాతికేళ్ల యువకుడు నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు వెళ్లాడు.
'వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, నామినేషన్, డిపాజిట్, ప్రచార ఖర్చులకు డబ్బులు లేవు. కాబట్టి లోన్ మంజారు చేయండి' అంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, రాజకీయ చైతన్యం మెండుగా ఉందని పేర్కొన్నాడు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. కాగా, ఆయనకు రుణం మంజూరయ్యేది, లేనిది చెప్పేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. ఈ నెల 28వ తేదీన వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
పోలింగ్ నవంబర్ 21వ తేదీన జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 4 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 5వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 24వ తేదీన జరుగుతుంది.












Click it and Unblock the Notifications