తల్లితో కలిసి తాగాడు: భార్య ముక్కు తెగ నరికాడు
సంగారెడ్డి: తల్లితో కలిసి మద్యం తాగిన ఓ వ్యక్తి భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ముక్కు తెగపోయింది. దానికితోడు భార్య తీవ్రంగా గాయపడింది కూడా. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది.
స్థానికంగా ఉండే అబ్ది పాండు, కేశమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే, పాండు తరుచుగా చిత్తుగా తాగి భార్యను కొట్టేవాడు. అలా కొట్టినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. అలా వెళ్లిపోయిన భార్యను పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని తీసుకుని వచ్చాడు.

భార్య కేశమ్మతో ఇక ముందు తాగబోనని పెద్దల సమక్షంలో అతను ఒప్పందం చేసుకున్నాడు. అయితే మాట తప్పి బుధవారం రాత్రి తల్లి పోచమ్మతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత భార్యతో, తల్లితో గొడవకు దిగాడు. కోపంతో ఉన్న పాండు కేశమ్మపై గొడ్డలితో వేటు వేశాడు.
ఈ దాడిలో కేశమ్మ ముక్కు తెగింది. విషయం తెలిసిన కాలనీవాసులు తల్లికి, కొడుకుకు దేహశుద్ధి చేశాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కేశమ్మ తండ్రి కేశయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications