భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం: భర్త ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో మృతి
హైదరాబాద్: తన భార్య తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుందని మనస్తాపంతో మహిళ భర్త ఆత్మహత్యాయత్నానికి నాలుగు రోజుల క్రితం పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి నాగేశ్వర రావు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారంనాడు మరణించాడు.
సికింద్రాబాద్‌కు చెందిన కరాటే మాస్టర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ మహిళా కానిస్టేబుల్, సంతోష్ అనే మరో కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఈ విషయం తెలుసుకొన్న భర్త మందలించాడు.

అయినా ఫలితం లేక పోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పంచాయతీ అధికారుల వద్దకు చేరింది. అక్కడ సంతోష్ అంటేనే ఇష్టమని తన భర్తతో కలిసి సంసారం చేయలేనని ఆ మహిళా కానిస్టేబుల్ తేల్చిచెప్పింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగేశ్వరరావు - తన చావుకు కారణం తన భార్య వివాహేతర సంబంధమని పేర్కొంటూ సెల్పీ వీడియో తీసి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications