మానసిక వికలాంగరాలితో అసభ్య ప్రవర్తన, వ్యక్తికి దేహశుద్ధి
పదహారేళ్ల ఓ మానసిక వికలాంగరాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు.
వరంగల్: పదహారేళ్ల ఓ మానసిక వికలాంగరాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. హసన్ పర్తి మండలం పగడపల్లి గ్రామంలో బాధిత బాలిక ఆదివారం ఉదయం ఆరుబయటకు వెళ్లింది.

ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమె అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే వెళ్లి ఆమెను రక్షించారు. నిందితుడిని రవీందర్‌గా గుర్తించారు. అతనిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అతనిని కస్టడీకి తీసుకున్నారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications