కారులో మంటలు: వ్యక్తి సజీవ దహనం(పిక్చర్స్)
రంగారెడ్డి: జిల్లాలోని శంకర్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారును లారీ ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వైపు నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న కారు (ఎపి 28 డిహెచ్ 1281) శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ మోకిల గ్రామానికి సమీపంలో ఢీకొన్నాయి.
లారీ డీజిల్ ట్యాంక్‌వైపు గట్టిగా తగలడంతో డీజిల్ ట్యాంక్ మూత ఎగిరిపోయి కారుపై డీజిల్ పడటంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. లారీ బలంగా కారును ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. దీంతో రోడ్డుపై వెళ్ళే వారు పక్కనే ఉన్న గుంటలోని నీటిని తెచ్చి కారుపై చల్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కొందరు కారు అద్దాలు పగులకొట్టి కాలుతున్న వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

మంటల్లో కాలిపోయిన కారు
జిల్లాలోని శంకర్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారును లారీ ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనయ్యాడు.

వ్యక్తి సజీవ దహనం
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వైపు నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న కారు (ఎపి 28 డిహెచ్ 1281) శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ మోకిల గ్రామానికి సమీపంలో ఢీకొన్నాయి.

మృతుడు అమియాకుమార్ మిశ్రా(ఫైల్)
లారీ డీజిల్ ట్యాంక్‌వైపు గట్టిగా తగలడంతో డీజిల్ ట్యాంక్ మూత ఎగిరిపోయి కారుపై డీజిల్ పడటంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. లారీ బలంగా కారును ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు.

రోధిస్తున్న కుటుంబసభ్యులు
దీంతో రోడ్డుపై వెళ్ళే వారు పక్కనే ఉన్న గుంటలోని నీటిని తెచ్చి కారుపై చల్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, భర్త మరణించిన విషయం తెలిసిన భార్య స్టేషన్‌లో కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.
రోధిస్తున్న కుటుంబసభ్యులు
దీంతో రోడ్డుపై వెళ్ళే వారు పక్కనే ఉన్న గుంటలోని నీటిని తెచ్చి కారుపై చల్లినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, భర్త మరణించిన విషయం తెలిసిన భార్య స్టేషన్‌లో కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.
కారు సీట్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. డ్రైవర్ సీటులోనే కారు నడుపుతున్న వ్యక్తి కళ్లముందే దహనమైపోయాడని వారు తెలిపారు. కాగా, ఎస్‌ఐ రేణుకారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. లారీ - కారీ ఢీకొని ఈ దుర్ఘటన జరిగిందన్నారు. కారు నెంబర్ ద్వారా నెట్‌లో చూసి వివరాలను కొన్ని తెలుసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారులో కాలి చనిపోయిన వ్యక్తి పేరు అమియాకుమార్ మిశ్రా (40) అతని భార్య పేరు గౌతమి అని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. అతను గచ్చిబౌలి వద్ద ఉన్న డుపాంట్ సీడ్స్ రిసెర్చ్ కంపెనీలో సేఫ్ సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మియాపూర్‌లో నివాసముంటున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందిన వ్యక్తి భార్య పోలీస్‌స్టేషన్‌కు వచ్చిందని చెప్పారు. కాగా, భర్త మరణించిన విషయం తెలిసిన భార్య స్టేషన్‌లో కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.












Click it and Unblock the Notifications