హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నేను ఐఏఎస్‌ను.. రూ.50వేలు పంపించండి': హైద్రాబాద్‌లో తూగోవాసి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌ను మాట్లాడుతున్నానని... ఐఏఎస్‌ను మాట్లాడుతున్నానని... ప్రజాప్రతినిధిని మాట్లాడుతున్నానని... నమ్మబలికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు చెందిన బాలవెంకట సుబ్రహ్మణ్య (35) తొమ్మిదో తరగతి చదివాడు. బతుకుదెరువు కోసం 2003లో హైదరాబాద్ వచ్చాడు. ఏడాది పాటు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేశాడు. అనంతరం రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఉంటూ మోసాలకు పాల్పడ్డాడు.

కీలక ప్రజాప్రతినిధులు, బడా రాయకీయ నాయకులు, ఉన్నతాధికారులు, విద్యాసంస్థల సంచాలకుల మాదిరిగా ఫోన్లు చేస్తూ బురిడీ కొట్టించేవాడు.

గతంలో తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, నల్గొండ, రాజమండ్రి, కరినగర్, హైదరాబాద్, కడప, కృష్ణా జిల్లాల్లో పదకొండు ఘటనలకు పాల్పడ్డాడు. అతని పైన హైదరాబాదులోని చిలకలగూడ, జూబ్లీహిల్స్, పటాన్ చెరు, పెద్దాపురం, అరకు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

 Man cheats Munisipal officer using IAS officer's name

బెయినపల్లి పోలీసు స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. తప్పించుకొని తిరుగుతున్నాడు. తాజాగా... మార్కెటింగ్ శాఖ కార్యదర్శి దాన కిశోర్‌ను అని చెబుతూ... ఆ శాఖ కార్యదర్శి టిఎస్ఆర్‌కె శాస్త్రి నుంచి గత నెల 19న రూ.50వేలు దండుకున్నాడు.

తాను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌ను మాట్లాడుతున్నానని, తాను పుష్కరాల బందోబస్తులో ఉన్నానని, తన పిల్లలు మెడికల్ కౌన్సెలింగ్‌కు వెళ్తూ సామాన్లు పోగొట్టుకున్నారని, అర్జంటుగా వారికి రూ.50వేలు సర్దితే డబ్బు రేపు తిరిగి ఇస్తానని మార్కెటింగ్ శాఖకు చెందిన సదరు అధికారికి ఫోన్ వచ్చిది.

నెల గడుస్తున్నా డబ్బు రాకపోయేసరికి ఆరా తీశాడు. మోసపోయానని గుర్తించాడు. కమిషనర్ మాదిరిగా నటించి బురిడీ కొట్టించిన విషయం వెలుగు చూసింది. ఇతను ఐదు కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్నాడు.
కాగా, నిందితుడు జూబ్లీహిల్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా అతని నేరాల గుట్టు రట్టయింది.

English summary
Man cheats Munisipal officer using IAS officer's name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X