ఆమెను నగ్నంగా చిత్రీకరించి: ఫేస్‌బుక్‌ ప్రేమ గాలంలో యువతి!..

తొమ్మిది నెలల క్రితం ఏర్పడిన ఈ పరిచయాన్ని.. రాజు ప్రేమగా మలిచాడు. ఇద్దరం తెలుగువాళ్లమే అంటూ మాయ మాటలు చెప్పి యువతిని ప్రేమకు ఒప్పించాడు. ఆపై వీడియో కాల్‌ ద్వారా ఆమె నగ్న చిత్రాలను చిత్రీకరించాడు.

నల్గొండ: ఫేస్‌బుక్‌లో అమ్మాయికి గాలం వేశాడు.. కాస్త అమాయకంగా మాట్లాడగానే 'ప్రేమ' అంటూ నమ్మించాడు. ఆపై భార్య-భర్తలమని భ్రమింపజేశాడు. వీడియో కాల్ ద్వారా యువతి నగ్న చిత్రాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. పెళ్లి మాటెత్తేసరికి అసలు రూపం బయటపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన యువతి చెన్నైలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాన రాజు దుబాయ్ లోని అరబ్ ఎమిరేట్స్ విమానంలో హౌజ్ కీపింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

 man cheats woman in the name of love on facebook

తొమ్మిది నెలల క్రితం ఏర్పడిన ఈ పరిచయాన్ని.. రాజు ప్రేమగా మలిచాడు. ఇద్దరం తెలుగువాళ్లమే అంటూ మాయ మాటలు చెప్పి యువతిని ప్రేమకు ఒప్పించాడు. ఆపై వీడియో కాల్‌ ద్వారా ఆమె నగ్న చిత్రాలను చిత్రీకరించాడు. తీరా పెళ్లి మాటెత్తేసరికి వాటిని ఇంటర్నెట్ లో పెడుతానంటూ బెదిరించాడు, తాను చెప్పింది వినాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా కూడా తెరిచాడు.

మోసపోయానని తెలుసుకున్న యువతి నకిరేకల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పథకం ప్రకారం అతన్ని దుబాయ్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు రప్పించారు. నకిరేకల్ సిఐ కె.సుబ్బరామిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ ధనుంజయ, సిసియస్ ఎస్‌ఐ రాఘవుతో కూడిన బృందాలు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తన వద్ద ఉన్న యువతి నగ్న చిత్రాల మెమెరీ కార్డును పోలీసులకు అందించాడు. అతని సెల్ ఫోన్, పాస్ పోర్టులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+