పట్టించుకోరా!.. ఆమెతో నా పెళ్లి చేయండి, లేకపోతే!: నిమ్స్‌లో యువకుడి హల్‌చల్

దాదాపు 2గం. పాటు భవనం పైనుంచి కిందకు దిగలేదు. చివరకు ఎలాగోలా అతన్ని కిందకు దిగేలా చేసిన పోలీసులు.. ఆ వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ.. ఓ యువకుడు నిమ్స్ ఆసుపత్రి భవనం ఎక్కాడు. పెళ్లి చేయకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. దాదాపు 2గం. పాటు భవనం పైనుంచి కిందకు దిగలేదు. చివరకు ఎలాగోలా అతన్ని కిందకు దిగేలా చేసిన పోలీసులు.. ఆ వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. కుత్బుల్లాపూర్ కు చెందిన ప్రదీప్(20) అనే యువకుడు ముఖంపై మచ్చలకు 2007నుంచి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, పైగా ఇండియాలో దీనికి చికిత్స కూడా లేదని, అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని ఇక్కడి వైద్యులు అతనికి సూచిస్తూ వస్తున్నారు.

man climbs on NIMS building, demands to marry with lover

ఇన్నేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా.. వైద్యులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రదీప్ తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం నిమ్స్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఓ మీడియా ప్రతినిధితో ఒక లేఖను ప్రదీప్ వద్దకు పంపించగా.. మొత్తం మీద అతను కిందకు దిగాడు. దీంతో ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఉదయం 8గం. నుంచి 9.55గం. వరకు అతను భవనం పైనే హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+