'రాజు గారి గది' సినిమా చూస్తూ థియేటర్‌లో ఓ వ్యక్తి మృతి, ఓంకార్ ఆర్థిక సాయం

హైదరాబాద్: సినిమా చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి సినిమా చూస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని బహదూర్‌పురాలోని ఓ థియేటర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.

సినీ నటుడు, ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు హారర్ కామెడీ చిత్రం 'రాజు గారి గది' చూస్తూ అమర్‌నాథ్(55)అనే ప్రేక్షకుడు మృతి చెందాడు. బహదూర్‌పురా పరిధిలోని మెట్రో థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు వెళ్లిన అమర్‌నాథ్ గుండెపోటు రావడంతో థియేటర్‌లోనే ప్రాణాలు వదిలాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆ థియేటర్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న దర్శకుడు ఓంకార్ మృతుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.

Man Dead

మలక్‌పేటలో సెల్‌ఫోన్ల దుకాణంలో చోరీ

మలక్‌పేటలోని ఓ సెల్‌ఫోన్ల దుకాణంలో భారీ చోరీ జరిగింది. మలక్‌పేటలో ఉన్న ఎంకె మొబైల్ షాపుకు కన్నం వేసిన దొంగలు రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచుకుపోయారు. మొబైల్ రూ.25 వేల నగదును కూడా ఎత్తుకెళ్లారు.

గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+