పాతబస్తీలో ఆటో ముందు భాగం పైకి లేచి.. షాకింగ్ ప్రమాదం, వ్యక్తి మృతి
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఘోరం జరిగింది. ఓ ఆటో హఠాత్తుగా పైకి లేచి, వ్యక్తి పైన పడటంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఘోరం జరిగింది. ఓ ఆటో హఠాత్తుగా పైకి లేచి, వ్యక్తి పైన పడటంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది.
జంగయ్య అనే హమాలీ రోడ్డు దాటుతున్నాడు. అతను రోడ్డు దాటుతుండగా ఎదురుగా ప్రయాణీకులతో ఓ ఆటో వస్తోంది. ఆటో తన వైపు రావడం చూసిన జంగయ్య తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే ఊహించని సంఘటన జరిగింది.

ఆటో వేగంగా వస్తూ... టైరు ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆటో ముందు భాగం పైకి లేచింది. అలా ఆటో ముందు భాగం పైకి లేస్తూనే ముందుకు వచ్చి.. జంగయ్యను గుద్దేసింది. అతనిని కిందపడేసింది. అతని కొద్ది దూరం లాక్కెళ్లింది.
ముందు భాగం కింద అతను పడిపోయాడు. అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఏదో పగ ఉన్నట్లే అతనిని ఆటో ఢీకొట్టింది. పోలీసులు ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications