కల్తీ కల్లు దొరక్క పిచ్చి చేష్టలు: బీడి వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం, మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చిగా వ్యవహరిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కల్తీ కల్లు దొరక్క మతిస్తిమితం కోల్పోయి గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొంకణివారిపల్లి గ్రామంలో బుధవారంనాడు జరిగింది.
గ్రామానికి చెదిన రవీందర్ రెడ్డి (39) గత కొన్నేళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారంనాడు కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లగా గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంది. దాంతో ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉంది.
దాన్ని గమనించని రవీందర్ రెడ్డి బీడీ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని రవీందర్ రెడ్డి సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, కల్తీ కల్లుకు బానిస అయిన ఓ మహిళ అది దొరకకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కూడా అదే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బోయ బుచ్చమ్మ (48) గత కొంత కాలంగా కల్తీ కల్లుకు అలవాటు పడింది.
వారం రోజులుగా కల్లు లభించకపోవడంతో మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తూ మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారంనాడు మరణించింది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications