ఉద్యోగం పేరుతో 7గురు ఎమ్మెల్యేలు, 4గురు ఎంపీలకు టోకరా (పిక్చర్స్)
హైదరాబాద్: మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలకో ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఆ ఘరానా నేరగాడి పేరు బాలాజీ. అతను ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలకు టోకరా వేశాడు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డిని మోసం చేసిన నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గతంలో పలువురు ప్రజాప్రతినిధులను మోసగించిన కేసులో శిక్ష అనుభవించి జూన్3న విడుదలైన ఈ నకిలీ అధికారి జైలు నుంచి బయటపడ్డ అయిదో రోజే మళ్లీ పాత దందాను మొదలు పెట్టాడు.
మల్కాజిగిరి జోన్ డీసీపీ రమా రాజేశ్వరి అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తోట బాలాజీ అలియాస్ లక్ష్మణ్ అలియాస్ మహేశ్ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వాసి. ప్రస్తుతం తెనాలిలో ఉంటున్నాడు.

మోసాలకు పాల్పడి ఎన్టీపీసీలో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నెల 8న మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకా రెడ్డికి ఫోన్ చేసి తన పేరు రాఘవేంద్ర రెడ్డి అని, సచివాలయంలోని గ్రామీణాభివృద్ధి అథారిటి నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.
కుటుంబ సంక్షేమ అభివృద్ధి నిధి ద్వారా కార్లు, కిరాణ షాపులు, డెయిరీ ఏర్పాటుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఒక్కో సభ్యుడు రూ.300 చెల్లించాలని, నగదు చెల్లించడానికి అదే ఆఖరు తేదీ అని నమ్మబలికాడు.
దీంతో ఎమ్మెల్యే కనకా రెడ్డి తన వ్యక్తుల ద్వారా రాఘవేంద్ర రెడ్డి ఆంధ్రాబ్యాంక్ ఖాతా నెంబర్‌లో రూ.90 వేలు డిపాజిట్ చేయించారు. ఆ తర్వాత రాఘవేంద్ర రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్యే అతని గురించి ఆరా తీసి మోసపోయినట్లు గుర్తించారు.

శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తితో అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తోట బాలాజీని అరెస్టు చేసి రూ.90,000ను స్వాధీనం చేసుకున్నారు. ఇతను గతంలో బొత్స, దేవేందర్ గౌడ్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి సహా పలువురిని ఇదే తరహాలో మోసం చేశాడు.
ఇతడిపై 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు వీ హనుమంత రావుకు కూడా రెండున్నరేళ్ల క్రితం టోకరా వేశాడు. 250 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. ఒక్కొక్కరి పేరు మీద రూ.500 డిపాజిట్ చేయించుకున్నారు.
-
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications