గంగను అట్లకాడతో వాతలు పెట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది
హైదరాబాద్: భార్యతో నూరేళ్లు కలిసి జీవించాల్సిన భర్త ఆమె పాలిట కాలమయుడై, తల్లి దండ్రులతో కలిసి భార్యన వేధిస్తున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ తాలుకా వెల్టూరు గ్రామానికి చెందిన జోగు నాగన్నపద్మ దంపతుల పెద్ద కుమార్తె గంగులు అలియాస్ గంగను బాలానగర్ రాజుకాలనీ దొంతిరెడ్డి నర్సిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు శ్రీనివాస రెడ్డికిచ్చి 20 నెలల క్రితం వివాహం జరిపించారు.
వివాహ సమయంలో రూ. 3 లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. శ్రీనివాస రెడ్డి భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్లినా, ఎవరితోనైనా మాట్లాడినా ఆమెను చితక బాదేవాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా ఆమెపై వేధింపులు ఆగలేదు. భర్తతో పాటు అత్త సావిత్రి, మామ నర్సిరెడ్డి సైతం ఆమెను వేధించేవారు.
ఇదంతా గమనించిన ఇంటి యజమాని చలపతిరావు ఇంటిని ఖాళీ చేయమని హెచ్చరించడంతో ఏప్రిల్ 1న ఇల్లు ఖాళీ చేసి సాయినగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వేధింపుల ఇంకా ఎక్కువయ్యాయి. చివరకు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తమామలు గంగను కట్టు బట్టలతో ఇంటినుంచి గెంటి వేశారు.
గంగను అట్లకాడతో వాతలు పెట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. గంగ దయనీయ స్ధితిలో ప్రస్తుతం రాజు కాలనీ రోడ్డు పక్కన చంటి బిడ్డతో న్యాయం కోసం పోరాడుతోంది. తమ బిడ్డకు ఎలాగైనా న్యాయం జరగాలని ఆమె తల్లి దండ్రులు కోరుతున్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications