భార్యతో శృంగారాన్ని 'లైవ్' ఇచ్చిన టెక్కీ: తీగ లాగితే 'షాకింగ్' విషయాలు..
గొడవ తర్వాత మారిపోయినట్లు నటించిన సదరు భర్త.. ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను 3వేల మంది గల ఓ అశ్లీల చిత్రాల సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
హైదరాబాద్: ప్రపంచీకరణ మహత్మ్యం జనాలను 'కెమెరా'లకు బాగా అలవాటు చేసింది. ఏకంగా బెడ్రూమ్ ల్లోకి దూరిపోయి వారి రహస్య జీవితాన్ని నెట్టింటికి ఎక్కించే అగత్యం కల్పించింది. మూడో నిఘా నేత్రంలా ఎప్పుడూ ఎవరి చేత వెంటాడబడుతామో తెలియని పరిస్థితి తీసుకొచ్చింది. ఆఖరికి అది ఇంట్లో వాళ్లే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ఉన్న 'కెమెరా'లు దుర్వినియోగం అవుతున్న సంగతి వింటే ఖచ్చితంగా విస్తుపోవాల్సిందే. వీటివల్ల ఈమధ్య కాలంలో పోర్న్ మార్కెట్ పరిధి మరింత విస్తృతి చెందిందని మాత్రం పక్కాగా చెప్పవచ్చు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

పోర్న్‌కు అడిక్ట్ అయిన భర్త:
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(33) అశ్లీల చిత్రాలు చూడటానికి బాగా అడిక్ట్ అయ్యాడు. అదో బలహీనతలా మారిపోయింది.విషయం భార్యకు తెలిసి పెద్ద గొడవ కూడా అయింది. కానీ తప్పయింది, క్షమించని బ్రతిమాలాడు. మరోసారి అలా చేయనని, బుద్ది వచ్చిందని చెప్పుకొచ్చాడు. పాపం అమాయకురాలైన ఆ ఇల్లాలు నిజమేనని నమ్మింది.

భార్యతో ఏకాంత క్షణాలను, లైవ్ స్ట్రీమింగ్:
ఈసారి ఏకంగా భార్యతో గడిపిన ఏకాంత క్షణాలనే ఏకంగా ఇంటర్నెట్ లోకి ఎక్కించేశాడు సదరు ప్రబుద్దుడు. భార్యకు ఏమాత్రం అనుమానం రాకుండా ఆమె అతనితో గడిపిన ఏకాంత క్షణాలను ఓ అశ్లీల చిత్రాలు వెబ్ సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. సదరు వీడియోను ఇంటర్నెట్ లోని పలు అశ్లీల చిత్రాల సైట్లలో దర్శనమివ్వడంతో.. విషయం గమనించిన బాధితురాలి సన్నిహితులు ఆమెకు సమాచారం అందించారు.

సదరు భర్త ఓ మేల్ ఎస్కార్ట్:
దీంతో బాధితురాలు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించగా.. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చివరికి ఈ మొత్తం తతంగానికి సూత్రధారి ఆమె భర్తేనని తేలిపోయింది. అశ్లీల చిత్రాలను చూడటానికి బానిసగా మారిపోయిన సదరు భర్త పలు వెబ్ సైట్లలో మేల్ ఎస్కార్ట్(మగ వ్యభిచారి)గా తన పేరు నమోదు కూడా చేసుకున్నాడు. మొబైల్ నంబర్ కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. దీని గురించి తెలియడం వల్లే భార్యతో గొడవ జరిగింది.

అనుమానం రాకుండా ఇలా:
గొడవ తర్వాత మారిపోయినట్లు నటించిన సదరు భర్త.. ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను 3వేల మంది గల ఓ అశ్లీల చిత్రాల సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఆ సమయంలో ల్యాప్ టాప్ ఆన్ చేసి ఉన్నా.. స్క్రీన్ పై ఏదో సినిమా ప్లే అవుతుండటంతో జరుగుతున్న మోసాన్ని భార్య గుర్తించలేకపోయింది.

దొరికిపోయాడిలా..:
పోర్న్ సైట్లో ఈ వీడియో లైవ్ స్ట్రీమ్ అవడంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి దీన్ని డౌన్ లోడ్ చేసుకుని మరో సైట్లో అప్ లోడ్ చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ వీడియో ఐపీ అడ్రెస్ కనిపెట్టడంతో.. సదరు భర్త గారే ఈ నిర్వాకం చేసినట్లుగా తేలింది. ఆర్థిక ఇబ్బందులు కూడా తనను ఇలా చేసేలా ఉసిగొల్పాయని సదరు భర్త వాపోవడం గమనార్హం. ఏదేమైనా కట్టుకున్న ఇల్లాలినే వంచించిన అతగాడు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.












Click it and Unblock the Notifications