ఇద్దరిపై రెండు నెలలుగా ఇంటి యజమాని కుమారుడి రేప్: అరెస్టు

హైదరాబాద్: ఓ వ్యక్తి తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు బాలికలపై రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాదులోని హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. మూడో అమ్మాయిపై అత్యాచారం యత్నం చేసే క్రమంలో అతని బండారం బయటపడింది.

ఇన్‌స్పెక్టర్ సూరపల్లి రవీందర్ కథనం ప్రకారం - హైదర్‌గూడ అత్తాపూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు (14), (13), (9) తమ తల్లిదండ్రులను కోల్పోయారు. వీరి తల్లి చనిపోయే ముందు తన ముగ్గురు పిల్లలో పెద్ద కూతురిని మల్లేపల్లిలోని ఓ వ్యక్తి వద్ద, ఇద్దరు చిన్న పిల్లలను విజయనగర్‌కాలనీలో మన్నాన్ వద్ద పనికి పెట్టింది.

Man held for raping minors in Hyderabad

కాగా, రెండు నెలలుగా రోజులుగా మన్నాన్ కుమారుడు రిజ్వాన్ (19) ఈ ఇద్దరు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇన్‌స్పెక్టర్ సూరపల్లి రవీందర్ బాలికలను రెస్క్యుహోంకు తరలించారు. రిజ్వాన్‌పై నిర్భయ కేసు నమోదు చేశామని తెలిపారు.

మూడో బాలికను కూడా అదే విధంగా చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. విచారణలో మరో ఇద్దరు బాలికలు కూడా ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదిలావుంటే, బాలికలపై జరిగిన లైంగిక దాడి గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద వార్త కవరేజ్‌కోసం వెళ్లగా రిజ్వాన్ తండ్రి మన్నాన్ మీడియాపై దుర్భాషలాడారు. అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతో మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+