దారుణం: కట్టుకున్న భార్యను నగ్నంగా రోడ్డుపై...

ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళ నడిరోడ్డుపై పరుగులు తీసింది. భర్త కత్తితో దాడి చేయడంతో ఆమెకు తలభాగంలో, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. కవిత, నర్సింహులు భార్యాభర్తలు. పెళ్లయిన దగ్గర్నుంచి నర్సింహులు ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. తను చేసే దొంగతనాలకు సహకరించడం లేదని ఆమెను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే మద్యం తాగివచ్చిన నర్సింహులు ఆమెపై బుధవారం కత్తితో దాడి చేశాడు.
ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినా ఆమెను వదలని నర్సింహులు.. బయటికి తీసుకొచ్చి నగ్నంగా రోడ్డుపై పరుగెత్తించాడు. చేతిలో ఓ కర్ర, కత్తిని పట్టుకుని ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. అతని చేతిలో కత్తిని చూసిన స్థానికులు ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు.
ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నర్సింహులును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మానవ మృగంలా నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, నిందితుడికి మరో భార్య కూడా ఉన్నట్లు తెలిసింది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం:జిల్లాలోని వాజేడు మండలంలో కె నరసింహరావు అనే రైతు పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. తన మూడెకరాల పొలంలో ఒక ఎకరం మిర్చి, మిగిలిన పొలంలో వరి పంట సాగు చేశాడు. వర్షాభావ ప్రభావం, కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. దీంతో ఆ కుంటుంబంలో విషాదం అలుముకుంది.












Click it and Unblock the Notifications