రావడంతోనే ఫ్యాషన్ డిజైనర్‌ను కౌగిలించుకున్నాడు, అరెస్ట్

హైదరాబాద్: ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పైన బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు వివరాలను మంగళవారం నాడు వివరించారు.

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఓ ఫ్యాషన్ స్టూడియోకు చెందిన డిజైనర్ సోమవారం తన స్టూడియోకు వెళ్లింది. అక్కడ దర్జీగా పని చేసే బాలానగర్‌కు చెందిన అశోక్ కుమార్ ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకున్నాడు.

దీంతో, ఆమె తిరగబడింది. సిబ్బందితో కలిసి నిందితుడిని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతని పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు.

Man hugs woman, arrested

ఆత్మహత్యకు యత్నించిన మహిళలను కాపాడిన లేక్ పోలీసులు

సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు మహిళలను లేక్ పోలీసులు కాపాడారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివసిస్తున్న ఓ మహిళ, యూసఫ్ గూడకు చెందిన మరో మహిళను పోలీసులు కాపాడారు.

అందులో ఒక మహిళకు 13 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది.

మరో మహిళకు గర్భాశయ కేన్సర్ సోకింది. భర్త సరైన చికిత్స చేయించకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో నష్టాలు వచ్చాయని మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్యా, భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త ప్రవర్తనతో విసిగు చెందిన ఆమె సాగర్లో దూకేందుకు యత్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+