జీహెచ్‌ఎంసీ అధికారుల ఓవరాక్షన్: ఇంట్లో వ్యక్తి ఉండగానే కూల్చేసిన వైనం

హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు ఓవరాక్షన్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని జవహార్ నగర్‌కు ప్రోక్లెయినర్లతో తరలి వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడ అక్రమ నిర్మాణమని గుర్తించిన ఓ ఇంటిని కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు.

Man injured in ghmc pulls house at jawahar nagar, hyderabad

ముందు వెనుకా చూసుకోకుండా ప్రోక్లెయినర్‌కు ఇంటిని కూల్చేయమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిమెంట్ రేకుల ఇల్లు కావడంతో ఇంటిలో నుంచి ఓ వ్యక్తి మూలుగులు వినిపించాయి. దీంతో షాక్ తిన్న జీహెచ్ఎంసీ అధికారులు పరుగు పరుగున అక్కడి వెళ్లి చూస్తే ఇంకేముంది ఇంట్లో వ్యక్తి ఉండగానే కూల్చామని తెలుసుకున్నారు.

గ్రేటర్ అధికారుల నిర్వాకం కారణంగా సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పడి ఉన్న ఆ వ్యక్తిని బయటకు తీసి హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో మనుషులున్నారా? లేరా? అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే వారు ఇంటిని కూల్చేస్తారా? అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+