ఇంటికి తీసుకెళ్తానని వచ్చి కోడలితో మామ అసభ్య ప్రవర్తన: జైలు శిక్ష

హైదరాబాద్: సొంత కోడలితో అసభ్యంగా ప్రవర్తించిన మామకు కోర్టు మూడేళ్ల జైలుశిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెం ప్రాంతానికి చెందిన హరిప్రసాద రావు వయస్సు అరవై ఏళ్లు.

ఇతని కొడుకుకు 2011లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. ఆమెను అత్తింటి వారు నిత్యం కట్నం కోసం వేధించే వారనే ఆరోపణలు ఉన్నాయి. వారి వేధింపులు భరించలేని ఆమె హైదరాబాద్‌ కుషాయిగూడలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

Man jailed for harassing daughter in law

కోడలిని తీసుకెళ్లడానికి మామ హరిప్రసాద రావు కుషాయిగూడ వచ్చాడు. ఒంటరిగా ఉన్న కోడలితో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ ఘటన విషయమై ఐదుగురిపై కోర్టులో ఛార్జీషీట్ నమోదయింది. విచారించిన జిల్లా 8వ సహాయ సెషన్స్‌ జడ్జి బాధితురాలి మామకు శిక్ష విధించారు. భర్తతోపాటు మిగతా వారిపై కేసు కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించారు.

కార్ల షోరూంలో చోరీ

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో కార్ల షోరూంలో చోరీ జరిగింది. షట్టర్లు పగులగొట్టి అందులో రెండు కార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు జరిగింది. వరుణ్ మోటార్స్ షోరూం తాళాలు పగులగొట్టి, షటర్లు లేపి షోరూంలో ఉన్న రెండు కార్లను దొంగిలించారు. శుక్రవారం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+