సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు భయ్యా..బయటపడ్డ అక్రమ సంబంధం

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ అక్రమ సంబంధం బయటపడింది. అయితే సినిమా స్టోరీని తలదన్నేలా ఉంది ఈ అక్రమ సంబంధం. సినిమాలు కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదా అనిపిస్తోంది. అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపేసిన ఓ ఘనుడు దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 48 రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఒక ఆస్పత్రిలో పిజియోతెరపిస్టుగా పని చేస్తున్నాడు. అతని భార్య , ఇద్దరు పిల్లలున్నారు. అయితే ప్రవీణ్ తాను పని చేస్తోన్న ఆస్పత్రిలో సోని ప్రాన్సిస్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ప్రియురాలు మోజులో పడి భార్య , పిల్లలను నిర్లక్ష్యం చేశాడు.

man killed his wife and children for his girlfriend

సోని ప్రాన్సిస్‌తో కలిసి ఉండాలని భావించిన ప్రవీణ్ తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈక్రమంలోనే కారులో గ్రామానికి వెళ్తుండగా, పోస్టుమార్టంలో ఎంత మోతాదులో పాయిజన్ డోస్ ఇస్తే రాదో గూగుల్ లో వెతికి తెలుసుకొని తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చి, 4 ఏళ్ల లోపున్న ఇద్దరు ఆడ పిల్లల గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గుర్ని చంపేశాడు.

ఆ తర్వాత కారును ఒక చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. అయితూ చనిపోయిన భార్య, పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కారులో ఒక ఇంజక్షన్, ప్రవీణ్ ఫోన్లో గూగుల్ హిస్టరీతో ప్రశ్నించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+