దొంగ అనే అనుమానంతో వ్యక్తి హత్య: దారి దోపిడీ

మహబూబ్‌నగర్/ హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం కొత్తూరులో దారుణమైన సంఘటన జరిగింది. దొంగ అనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని స్థానికంగా ఉన్న కాలువలో పడేశారు.

అయితే అటువైపు వెళ్లిన కొందరు వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని కొత్తూరులో ఓ శుభకార్యానికి వచ్చిన కొండారెడ్డిగా గుర్తించారు. కొండారెడ్డి దొంగ కాదు. కొండారెడ్డి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

man killed suspecting thief in Mahaboobanagar district

సికింద్రాబాదులోని అల్వాల్‌లోని జవహర్‌నగర్‌లో దారి దోపిడీ జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వ్యక్తి వద్ద ఉన్న రూ. 1.10 లక్షలను దుండగులు అపహరించారు. బాధితుడు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అగ్నిప్రమాదం

హైదరాబాదు నగరంలోని బేగంబజార్‌ ఉస్మాన్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకవంతో ఓ భవనంలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం తీవ్రత పెరగడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+