అమ్మాయిల ఫోటోలు తీస్తూ పట్టుబడిన ఆకతాయి: దేహశుద్ధి

హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో అమ్మాయిల ఫొటోలు తీస్తూ ఓ యువకుడు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతన్ని పట్టుకుని ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌లో జరిగింది. దేహశుద్ధి చేసిన తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు.

ఎంఎంటిఎస్ రైలు దిగి వస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తన ఫోన్‌తో ఫొటో తీశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తన ఫొటో ఎందుకు తీశావంటూ అతనితో వాగ్వివాదానికి దిగింది. అయితే, అతను పొంతన లేని సమాధానాలిచ్చాడు.

Man nabbed for picturising girls

ఈ విషయాన్ని గుర్తించిన సహ ప్రయాణికులు ఆ వ్యక్తిని నిలదీసినా ఫలితం లేకపోయింది. అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని చూశారు. అందులో చాలా మంది అమ్మాయిల ఫొటోలు ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు వచ్చే అందమైన యువతుల ఫొటోలను అతను తన సెల్‌లో బంధిస్తున్నాడని వారు గుర్తించారు. అతన్ని చితకబాదారు.

ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తు్నారు. అతను యువతుల ఫోటోలను ఎందుకు తీస్తున్నాడనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+