హైదరాబాదులో బ్యాంకు ముందు దుస్తులు విప్పి నిరసన
హైదరాబాద్: గన్‌ఫౌండ్రిలోని ఓ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ హల్‌చల్ చేశాడు. అదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన ప్రకాశ్ అనే వ్యాపారి బాసరలో హోటల్ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన భవనం కోసం నిజామాబాద్ జిల్లాలోని బ్యాంకు శాఖలో మార్టిగేజ్ చేశాడు.
మార్టిగేజ్ తొలగించాలని ఆ తర్వాత అధికారులను కోరాడు. వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన గురువారం నాడు బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనగు దిగాడు. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బ్యాంకు రీజినల్ అధికారిణి కలిసేందుకు వచ్చాడు.

కానీ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో అతను తన చొక్కా, బనియన్ విప్పేసి అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. బ్యాంకు వినియోగదారులు పరుగులు పెట్టారు. సిబ్బంది సైతం కలవరపడింది. సెక్యూరిటీ సిబ్బంది అతనిపై అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు బ్యాంకుకు చేరుకొని వ్యాపారికి నచ్చచెప్పారు. బ్యాంకు రీజినల్ అధికారితో మాట్లాడి అపాయింటుమెంట్ ఇప్పించారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లి పోలీసులు అతనికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications