ఒంటిపై పెట్రోల్:రోడ్డుపై టీవీ నటి, ప్రియుడి హల్‌చల్
హైదరాబాద్: పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన పైన పెట్రోల్ పోసి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఓ బుల్లితెర నటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హన్మకొండకు చెందిన యువతి (21) ఎస్సార్ నగర్లోని లేడీస్ హాస్టల్లో ఉంటూ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చేస్తూ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది.
శ్రీకృష్ణా నగర్లోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న కరీంనగర్ జిల్లాకు చెందిన సుఖేష్ (24)తో ఈమెకు నాలుగు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే కొంతకాలానికి సుఖేష్ ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి పెళ్లికి నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మాట్లాడుకుందామని సుఖేష్ ఆమెను తన ద్విచక్ర వాహనం పైన ఎక్కించుకున్నాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో బైక్ ఆపి తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమె పైన పోశాడు. తిరిగి ఆమె సుఖేష్ పైన పెట్రోల్ పోసింది. స్థానికిలు పోలీసులకు సమాచారం అందించడంతో, అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యువతి పేరు సాయిప్రియగా తెలుస్తోంది.

సుఖేష్
పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన పైన పెట్రోల్ పోసి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఓ బుల్లితెర నటి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆత్మహత్య
ప్రేమించి, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న నవ దంపతులు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందారు. చేతిలో చేయి పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య
దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి గేటు గ్రామానికి చెందిన జీవన్ రావు, అప్పలమ్మలు దంపతులు. షాపూర్ నగర్ కళావతి నగర్లో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు వెంకటేష్(23).

ఆత్మహత్య
వెంకటేష్ కోల్‌కతాకు చెందిన కిషన్ రావు, అనురాధ దంపతుల కుమార్తె ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురు జనవరి నెలలో ఇంటి నుండి వెళ్లిపోయారు. బహదూర్ పల్లిలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలైనా గది తలుపులు తీయకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి కిటికీ లోనుంచి చూడగా ఉరేసుకొని కనిపించారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఆత్మహత్య
కాగా, వెంకటేష్ కొద్ది రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదు. కుటుంబ సభ్యులు ఎప్పుడు ఫోన్ చేసినా పనిపై చెన్నై వెళ్లానని, పదిరోజుల్లో వస్తానని చెప్పేవాడు. మూడు రోజుల క్రితం మాత్రం బావకు ఫోన్ చేసి తాను ఓ యువతిని పెళ్లి చేసుకున్నానని, ఇంటికి రావాలని చెప్పాడు. మరోవైపు, ప్రీతి ప్రస్తుతం రెండు నెలల గర్భిణి. గతంలో వివాహం అయి విడాకులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణమని భావిస్తున్నారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications