నమ్మించి అత్యాచారయత్నం, ఆపై బెదిరింపు, యువతి ఇలా..
విధ్యార్థిని నమ్మించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అంతేకాదు ఆ యువతిని బెదిరించడంతో బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి లే అవుట్ లో నివాసం ఉంటున్న 17 ఏళ్ళ యువతికి ఘట్ కేసర్ సమీపంలోని కళాశాలలో డిప్లోమోలో సీటొచ్చింది.
అయితే ఆమెకు సహయం చేస్తానని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్చర్లకు చెందిన బానోతు రవి నమ్మించాడు.
రవిని నమ్మి ఆ యువతి ఆతనితో పాటు మూడు దఫాలు కాలేజీకి వెళ్లింది.యువతి తనను నమ్మిందని భావించిన రవి ఆ యువతిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు.

రవి ఆ యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.అయితే ఈ విషయాన్ని ఆ యువతి నివాసం ఉండే ఇంటి యజమాని గుర్తించాడు. దీంతో నిందితుడు పారిపోయాడు.
శుక్రవారం నాడు ఆ యువతికి నిందితుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు నిర్భయ, ఫోక్సో చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications