బాలికపై వృద్ధుడి రేప్, ప్రియుడి ఇంటిముందు బిటెక్ అమ్మాయి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో పదిహేనేళ్ల బాలిక పైన వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం
పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి దగ్గర బిటెక్ విద్యార్థిని మంగళవారం నాడు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం చింతల్‌కు చెందిన వెంకటేష్ తనయుడు శ్రీనివాస్ బిటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఖమ్మం జిల్లాలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అప్పట్లో తన క్లాస్‌మేట్ అయిన, అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
ప్రస్తుతం ఆమె ఘట్‌కేసర్‌లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఇరువురు మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో అతను ముఖం చాటేశాడు. దీంతో ఆమె చింతల్ వచ్చి ప్రియుడి ఇంట ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె నిద్రమాత్రలు మింగింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆమను సూరారంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకుంటోంది.












Click it and Unblock the Notifications