అంతకు ముందే ఓ పెళ్లి, ప్రేమ పేరుతో యువతితో మరో పెళ్లి: పదేళ్ల జైలు

వరంగల్‌: తనకు పెళ్లయిన విషయాన్ని గోప్యంగా ఉంచి బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని మోసం చేసిన వ్యక్తికి పదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి కేబీ నర్సింహులు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన పబ్లక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ సర్ధార్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన శివరాత్రి శివ వివాహితుడు. ఇతడికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో బంధువుల ఇంటికి వచ్చిన బీమదేవరపల్లి మండలం కారుణ్యపురం గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు.

Man sentenced for 10 years for cheating a girl

29 డిసెంబర్ 2014న పెళ్లి చేసుకుంటానని నమ్మించి యాదగిరిగుట్టకు తీసుకెళ్లి దండలు మార్చుకున్నారు. అదే రోజు హైదరాబాద్‌కు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో ఉంచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ డేవిడ్ రాజు పరిశోధించి నిందితున్ని అదుపులోకి తీసుకోగా విషయం వెలుగు చూసింది.

తన వివాహాన్ని గోప్యంగా ఉంచి మరో యువతిని ప్రేమపేరుతో వంచించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువైందని భావించి శివరాత్రి శివకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+