కామాంధుడు: చెల్లెపై అత్యాచారం చేసిన అన్న
ఖమ్మం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి చెల్లెలిపై అత్యంత నీచానికి ఒడిగట్టాుడు. మానసిక వికలాంగురాలు అయిన సొంత పెదనాన్న కూతురి(16)పై అత్యాచారానికి పూనుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగిండ మండలం మేడేపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది.
బాధితురాలి తండ్రి ఖమ్మంలో కూలీపనికి వెళ్లగా, తల్లి బాలిక పెద నాన్న చేనులో పత్తి ఏరేందుకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక తల్లి 'ఇంటికెళ్లి భోంచేసి, చెల్లిని తీసుకురా'అని యువకుడికి చెప్పింది. బాబాయి ఇంటికి వెళ్లిన యువకుడు బాలికను బైక్‌పై ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకుని వెళ్లాడు.

తర్వాత పొలం వద్దకు వెళ్లి చెల్లి రానంటోందని అబద్ధం చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నిందితుడిని యడవల్లి వేణుగా గుర్తించారు.
తన ద్విచక్ర వాహనంపై తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ మేరకు యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువకుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications